ప్రభుత్వ భవనాల స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే.
తెలంగాణ స్రవంతి నాగారం మార్చి 31 నాగారం మండలనికి చెందిన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగారం బంగ్లా గ్రామపంచాయతీ లోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో సర్వే నెంబరు 542 లో ఎంపీడీవో కార్యాలయానికి 400 స్క్వేర్ మీటర్స్ తాహసిల్దార్ కార్యాలయానికి 756 స్క్వేర్ మీటర్స్ కేటాయించినట్టు తెలిపారు. ప్రజా పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ భవనాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు అధికారులు కూడా సజావుగా పనులు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేవేందర్ ప్రసాద్ ఎం పి డి వో బీమ్ సింగ్ సర్వేయర్ సాయికృష్ణ జి పి ఓ వెంకన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శాగంటి రాములు పానుగంటి నరసింహారెడ్డి సర్పంచులు బయ్యం సుజాత వెంకన్న వంగూరి దామోదర్ గండమల్ల లక్ష్మయ్య ఎర్ర సావిత్రి యాదగిరి బుక్క శీను ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం ఎలమకంటి సోమయ్య మోహన్ రెడ్డి చిత్తలూరి వెంకన్న వార్డు సభ్యులు నాగరాజు ఉమ ఈసు తదితరులు పాల్గొన్నారు.