“వృద్ధాప్యంలోనూ అప్పుల వేదన… బ్రిడ్జి పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న వృద్ధుడు”
తెలంగాణ స్రవంతి ప్రతినిధి, ఎర్రుపాలెం:
ఎర్రుపాలెం మండలం పరిధిలోని బానిగండ్లపాడు గ్రామం కు చెందిన యాన్నం వెంకటరామిరెడ్డి (సుమారు 70 సంవత్సరాలు) అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లభించిన సమాచారం ప్రకారం, వెంకటరామిరెడ్డి దీర్ఘకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో మానసికంగా కలత చెంది కట్టేలేరు బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఎర్రుపాలెం ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. వృద్ధాప్యంలోనూ అప్పుల భారంతో ప్రాణాలు కోల్పోవాల్సి రావడం హృదయ విదారకమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉 అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రభుత్వం ఇలాంటి బాధిత కుటుంబాలకు ఆర్థిక, మానసిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
🌐 మరిన్ని వార్తల కోసం: https://telanganasravanti.in�
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి ✍️
⚠️ గమనిక:
మానసిక ఒత్తిడిలో ఉన్నవారు ఒంటరిగా ఉండకుండా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం చాలా ముఖ్యం. జీవితం విలువైనది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి