హాస్టల్‌లో విద్యార్థుల కష్టాలు.. భోజనం నుంచి మౌలిక వసతుల వరకు పరిష్కారం కావాలంటూ డిమాండ్
హాస్టల్ విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.. మేస్ ఛార్జీలు పెంచాలని ఏఐపీఎస్‌యూ డిమాండ్ STUDENT WELFARE నిజామాబాద్ జిల్లా, బోధన్: తెలంగాణ స్రవంతి సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఏఐపీఎస్‌యూ) డిమాండ్ చేసింది. ఏఐపీఎస్‌యూ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలి ఈ సందర్భంగా ఏఐపీఎస్‌యూ బోధన్ డివిజన్ కార్యదర్శి సునీల్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం అందిస్తున్న మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేశ...