ఇంటింటికి సిపిఐ కార్యక్రమం: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పిలుపు

 


ఇంటింటికి సిపిఐ కార్యక్రమానికి పిలుపు – సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు

ఏప్రిల్ 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుండి 10 వరకు “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ఉద్యమాలకు తోడ్పాటు అందించేందుకు ప్రజలు విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లంల యాదగిరి అధ్యక్షతన జరిగింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల స్థాయి నాయకులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వాల వైఫల్యాలపై విమర్శలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు అయ్యే వరకు ప్రజల వెంట ఉండి పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉందని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఇంటి స్థలాలు, ఇళ్లపై డిమాండ్లు

ఇంటి స్థలాలు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

పాల్గొన్న నాయకులు, బాధ్యులు

ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్, గుగులోతు రాజారాం, పెండ్ర కృష్ణ, తిరుమలగిరి మండల కార్యదర్శి ఎస్కె ఫయాజ్, నీలా శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర సైదులు, కార్యదర్శి ఎడెల్లి శ్రీకాంత్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి జంపాల మల్లయ్య, నియోజకవర్గ మహిళ సంఘం అధ్యక్షురాలు దేశగాని హేమలత తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సిపిఐ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని నాయకులు కోరారు.

👉 మరిన్ని వివరాలకు:

🌐 https://telanganasravanti.in⁠�

✍️ తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం