సిద్దిపేటలో రాజకీయ కలకలం – తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు
సిద్దిపేట జిల్లా: జిల్లాలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్నకోడూరు మండలం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చేరికలతో అగ్రవర్ణ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో జరిగిన కార్యక్రమంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, తమ జీవన స్థితి మారాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల అభ్యున్నతి కోసం ఈ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పి. నర్సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేష్, చిన్నకోడూరు మండల ప్రధాన కార్యదర్శి గొట్టిపర్తి శ్రీనివాస్, జిల్లా నాయకులు గిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి