హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపు
తెలంగాణ స్రవంతి ప్రతినిధి:- సచిన్ కుమార్
శోభాయాత్ర ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పరిశీలన
జుక్కల్, మార్చి 31: కామారెడ్డి జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించి పలు కీలక సూచనలు చేశారు. ప్రధాన కూడళ్లను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.
ప్రత్యేక సమావేశం – క్రమశిక్షణతో వేడుకలు నిర్వహించాలి
ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేడుకలను క్రమశిక్షణతో, శాంతియుతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
భక్తులు, నిర్వాహకులు సహకరించాలి
ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాలకు:
🌐 https://telanganasravanti.in�
✍️ తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి