విదేశీ గడ్డపైనా.. రాఖీ బంధం చెక్కుచెదరదు!
నారాయణఖేడ్, సెప్టెంబరు 2: వేల మైళ్ల దూరంలో విదేశాల్లో ఉన్నా.. పుట్టిన గడ్డపై పెరిగిన ఆత్మీయతలు, అన్నాచెల్లెళ్ల అనుబంధాలు మనసును విడిచిపెట్టవు. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అలాంటి భావోద్వేగానికి ప్రతీకగా ఓ ప్రత్యేకమైన కలయిక చోటుచేసుకుంది.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు కేటీఆర్‌ను గుఱ్ఱపు సౌమ్య మచ్చేందర్ కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
విదేశాల్లో జీవనం సాగిస్తున్నప్పటికీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయ బంధాలను గుండెల్లో పదిలంగా దాచుకున్న సౌమ్య మచ్చేందర్ రాఖీ పండుగ సందర్భంగా స్వదేశానికి వచ్చి అన్నగా భావించే కేటీఆర్‌కు రాఖీ కట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. రాఖీ కట్టిన సమయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కేటీఆర్ అన్న ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ముందుకు సాగాలని సౌమ్య మచ్చేందర్ ఆకాంక్షించారు.
రాఖీ కేవలం ఓ పండుగ కాదు.. అది ప్రేమకు గుర్తు, నమ్మకానికి నిదర్శనం, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. దేశాలు మారినా.. ఖండాలు దాటినా.. మన సంస్కృతి, మన బంధాలు మనతోనే ఉంటాయని ఈ సందర్భంగా సౌమ్య మచ్చేందర్ పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నప్పుడు రాఖీ పండుగ రోజున స్వదేశం, కుటుంబ సభ్యులు, అన్నాచెల్లెళ్ల జ్ఞాపకాలు మరింతగా గుర్తుకొస్తాయని.. అలాంటి సమయంలో ఆత్మీయంగా రాఖీ కట్టడం ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న కేటీఆర్ అన్నకు రాఖీ కట్టడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని సౌమ్య మచ్చేందర్ పేర్కొన్నారు.
మన ఆత్మీయ బంధాలు మనతోనే ఉంటాయి”
జనంనుంచి జనంలోకి
telanganasravanti.in


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి