ప్రగతినగర్ పీకాక్ జంక్షన్‌లో విద్యుత్ బాక్సుల సమస్య.. భద్రతపై స్థానికుల ఆందోళన
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి ప్రగతినగర్ పీకాక్ జంక్షన్‌లో విద్యుత్ భద్రతపై ఆందోళన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం • బాచుపల్లి • సెప్టెంబర్ 30 • తెలంగాణ స్రవంతి ప్రగతినగర్ పీకాక్ జంక్షన్‌లో తెరిచి ఉన్న విద్యుత్ బాక్సులు పాదచారులు, చిన్నారులు, స్థానికులకు భద్రతా ముప్పు.. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 30 (తెలంగాణ స్రవంతి): బాచుపల్లి మండలం ప్రగతినగర్ పీకాక్ జంక్షన్ వద్ద తెరిచి ఉన్న విద్యుత్ పవర్ బాక్సులు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యుత్ బాక్సులకు రక్షణ కవర్లు లేకపోవడం, అవి తెరిచి ఉండటంతో పాదచారులు, చిన్నారులు, సమీప నివాసితులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. రద్దీగా ఉండే జంక్షన్ ప్రాంతంలో విద్యుత్ పరికరాలు ఇలా తెరిచి ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఆడుకునే సమయంలో లేదా పాదచారులు అట...