నారాయణఖేడ్‌లో పేకాట స్థావరంపై పోలీసుల ఉక్కుపాదం.. 22 మంది అదుపులో, రూ.3.52 లక్షల నగదు స్వాధీనం
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 22 మంది అదుపులోకి
రూ.3.52 లక్షల నగదు స్వాధీనం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
నారాయణఖేడ్, ఆగస్టు 2 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణఖేడ్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.3,52,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు దాడి
గత రాత్రి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ఆకస్మికంగా పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాటలో పాల్గొంటున్న 22 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
దాడిలో పాల్గొన్న పోలీసులు
ఈ దాడిలో కానిస్టేబుళ్లు హరి, రాహుల్, సంకీర్తన్‌రెడ్డి, శ్రీకాంత్, పరమానందం, ప్రవీణ్ పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జూదంపై కఠిన చర్యలు
జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ స్రవంతి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి