జుక్కల్ ఎక్స్‌రోడ్ వద్ద ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం | తెలంగాణ స్రవంతి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్ ఎక్స్‌రోడ్ సమీపంలో కెమెరాస్ కల్లాలి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న TG35Z0030 నంబర్ గల బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో డ్రైవర్ మృతి.. 13 మందికి గాయాలు బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బిచ్కుంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమా...
మధిర మండలంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మధిర మండలం తొండలగోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని తొర్లపాడు గ్రామానికి చెందిన వగ్గలా శివరామ్ గోపి (ముదిరాజ్) మరియు మధిర మండలం మర్లపాడు గ్రామానికి చెందిన రేగల్ల కావ్య (రెడ్డి) గత నాలుగు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు తమ ప్రేమ వివాహానికి అంగీకరించరని భావించిన ఈ ప్రేమికులు 07-03-2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తమ ఇష్టప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వారు మధిర పట్టణ పోలీసు స్టేషన్లో హాజరై విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణ వలయాధికారి కిషోర్ కుమార్ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి, ఇద్దరూ పెద్దవాళ్లు కావడంతో చట్ట ప్రకారం వారి స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకూడదని సూచించినట్లు సమాచారం. అలాగే అమ్మాయికి ఏమైనా అపాయం జరిగితే అబ్బాయి బాధ్యత వహిస్తాడని రాతపూర్వకంగా పత్రం తీసుకుని ఇద్దరినీ అబ్బాయి ఇంటికి పంపించారు. అయితే 09-03-2026న భార్యాభర్తలు ఇద్దరూ ఎర్రుపాలెం మండలంలోన...
ప్రభుత్వ బడికి.. గంగారం తండా ఆదర్శం! 68 మంది విద్యార్థులు.. రెండు గదుల్లోనే అద్భుత అభ్యసన వాతావరణం నారాయణఖేడ్, ఆగస్టు 10 (తెలంగాణ స్రవంతి): ప్రభుత్వ పాఠశాల అంటే పరిమిత వనరులు, సాధారణ వసతులు, తక్కువ సంఖ్యలో విద్యార్థులు అనే అభిప్రాయానికి గంగారం తండా ప్రాథమిక పాఠశాల భిన్నమైన సమాధానం చెబుతోంది. సంకల్పం, అంకితభావం ఉంటే ప్రభుత్వ బడిని సైతం అత్యుత్తమ విద్యాలయంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తోంది. పరిమిత వనరులను సృజనాత్మకంగా వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తున్న ఈ పాఠశాల ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. 🏫 రెండు గదుల్లో 68 మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని కరస్‌గుత్తి కాంప్లెక్స్ పరిధిలో ఉన్న గంగారం తండా ప్రాథమిక పాఠశాలను జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన తీరును, పాఠశాలలోని విద్యా వాతావరణాన్ని పరిశీలించారు. ప్రస్తుతం పాఠశాలలో 68 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం రెండు తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు కల్పించిన అభ్యసన వాతావరణం ఆయనను విశేషంగా ఆకట్టుకుంది. 📚 గోడలే పాఠ్యపుస్తకాలు...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి