🗳️ జుక్కల్‌లో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు... అధికారులకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచనలు
🗳️ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు... సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
మద్నూర్ | జూలై 2 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి అర్హుడి ఓటు జాబితాలో కొనసాగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. ఈ మేరకు మద్నూర్ మండల తహసీల్దార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండీ ముజీబ్‌ను కలిసి పలు సూచనలు చేశారు.
వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించొద్దు
ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్న వారి ఓట్లను తొలగించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
పారదర్శకంగా సర్వే జరుగుతోంది: తహసీల్దార్
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎండీ ముజీబ్ మాట్లాడుతూ, ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, ఈ ప్రక్రియ వల్ల అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోవనే అపోహలు అవసరం లేదన్నారు.
డబుల్ ఓట్ల నివారణే ప్రధాన లక్ష్యం
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడడం, డబుల్ ఓట్లను నివారించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తహసీల్దార్ వివరించారు. ప్రజలు సర్వేకు పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలను అధికారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి