శాసనసభ హామీల అమలు కమిటీలో కీలక బాధ్యతలు.. ప్రజల హామీల అమలుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

శాసనసభ హామీల అమలు కమిటీ సభ్యుడిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తా

అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ


చండ్రుగొండ, జూలై 28 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి బొగ్గుల శివనాగిరెడ్డి : తెలంగాణ శాసనసభలో ఏర్పాటైన వివిధ కీలక కమిటీల తొలి సమావేశాలు మంగళవారం శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో జరిగాయి. ఈ సమావేశాలకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై కమిటీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తా

ప్రభుత్వ హామీల అమలు కమిటీ సభ్యుడిగా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు సకాలంలో అమలయ్యేలా తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు

గిరిజన శాసనసభ్యుడైన తనకు ప్రభుత్వ హామీల అమలు కమిటీలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పార్టీ అధిష్ఠానం మరియు సంబంధిత నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గిరిజనులు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

ఈ అవకాశం ద్వారా గిరిజనులు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత బలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా నియోజకవర్గ అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.


TS MEDIA TELUGU

తెలంగాణ స్రవంతి

జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం