నీట్ అవకతవకలపై ఢిల్లీలో విద్యార్థుల పోరు.. మధిరలో గాంధీ శాంతి సేన నిరసన
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది విద్యార్థులు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్న సందర్భం లో విద్యార్థులకు మద్దతుగా విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి అని లడక్ సామాజిక కార్యకర్త విద్యావేత్త సోనమ్ వంగచుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగాను కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మధిర పట్టణం లో మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో మధిర వ్యవసాయ శాఖ ఫామ్ రోడ్ లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు.
నీట్ వ్యవహారంపై విద్యార్థులకు మద్దతు
నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ఇలాంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని మహాత్మా గాంధీ శాంతి సేన సభ్యులు పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలి
నీట్ పరీక్షలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తున్న వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
గాంధీ విగ్రహానికి వినతి పత్రం
మధిర వ్యవసాయ శాఖ ఫామ్ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల గొంతును వినాలని, సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ఎస్ నాగేశ్వరావు,గాంధీ శాంతి సేన సభ్యులు మొగిలి శ్రీనివాసరావు,పుష్పారావు, బి, సురేష్,జీవన్,పండు, లాల్ సైదా, అభిరామ్,పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గాంధీ శాంతి సేన ప్రతినిధులు తెలిపారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, నమ్మకం పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనంనుంచి జనంలోకి
telanganasravanti.in


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి