విద్యుత్ మోటార్ మాయం..! చెన్నూరులో రైతు కన్నీరు.. వరుస చోరీలతో అన్నదాతల ఆందోళన


మోటార్ లేక నానా అవస్థలు పడుతున్న రైతన్న.. దొంగలను పట్టుకునేవారే లేరా?

కల్లూరు, జూలై 14 | తెలంగాణ స్రవంతి ప్రతినిధి

ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో రైతుల ఆందోళనకు కారణమైన ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయానికి కీలకమైన విద్యుత్ నీటి మోటార్లపై దొంగల కన్ను పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెన్నూరు గ్రామం నారాయణపురం రోడ్డు సమీపంలో రైతు మాదల రామారావు తన పొలానికి సాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ నీటి మోటార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లినట్లు తెలిపారు.

మోటార్ లేక పంటలకు నీరు అందని పరిస్థితి

వ్యవసాయ పనులు సాగుతున్న సమయంలో మోటార్ చోరీ కావడంతో పొలాలకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టపడి ఏర్పాటు చేసుకున్న పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు.

ఇది మొదటిసారి కాదు.. మూడు సార్లు చోరీ

గతంలో కూడా ఇదే విధంగా మూడు సార్లు విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయని రైతు మాదల రామారావు తెలిపారు. గ్రామంలోని పలువురు రైతులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు.

వరుసగా జరుగుతున్న మోటార్ చోరీలతో రైతులు భయాందోళనకు గురవుతున్నారని, రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాలంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

దొంగలను పట్టుకోవాలి.. రైతులకు రక్షణ కల్పించాలి

విద్యుత్ మోటార్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు స్పందించాలని, చోరీకి గురైన మోటార్‌ను గుర్తించి న్యాయం చేయాలని రైతు మాదల రామారావు కోరారు.


తెలంగాణ స్రవంతి ప్రతినిధి
TS MEDIA TELUGU – జనంనుంచి జనంలోకి

telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జుక్కల్‌ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తక్షణ స్పందన.. బాధితులకు అండగా చర్యలు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

గంగారం తండా ప్రభుత్వ బడికి జేజేలు.. రెండు గదుల్లోనే 68 మంది విద్యార్థులకు అద్భుత విద్యాబోధన