వడదెబ్బపై ప్రజలకు అవగాహన… తొర్లపాడులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ

వడదెబ్బపై ప్రజలకు అవగాహన… తొర్లపాడులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ


పీహెచ్‌సీ దెందుకూరు ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

తెలంగాణ స్రవంతి ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ దెందుకూరు వైద్యులు డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ ఆధ్వర్యంలో పారామెడికల్ బృందం తొండలగోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని తొర్లపాడు గ్రామ బీసీ కాలనీలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది.


ప్రజలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి వాటి వినియోగంపై వివరించారు.


ఓఆర్‌ఎస్ ద్రావణం తయారీపై ప్రాక్టికల్ డెమో

వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అలాగే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాక్టికల్‌గా కలిపి చూపించి వివరించారు.


పాల్గొన్న ఆరోగ్య సిబ్బంది

ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది లంకా కొండయ్య, ఏఎన్‌ఎంలు భారతి, నాగమణి, ఆశ కార్యకర్త వేల్పుల విజయమ్మ, డ్వాక్రా మహిళలు, వృద్ధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జుక్కల్‌ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తక్షణ స్పందన.. బాధితులకు అండగా చర్యలు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

గంగారం తండా ప్రభుత్వ బడికి జేజేలు.. రెండు గదుల్లోనే 68 మంది విద్యార్థులకు అద్భుత విద్యాబోధన