తెలంగాణ రక్షణ సేన మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా పగిడిపల్లి వినోద్… పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
తెలంగాణ రక్షణ సేన మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా పగిడిపల్లి వినోద్… పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన పగిడిపల్లి వినోద్
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో నూతన పార్టీ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా పగిడిపల్లి వినోద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జెండా పండుగలను విజయవంతం చేయాలని పిలుపు
మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్న జెండా పండుగ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి పార్టీ కార్యక్రమాలను చేరువ చేస్తాం
మధిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జెండా గద్దెలు ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ అంశాలను ప్రజలకు చేరువ చేసే దిశగా పనిచేస్తానని పగిడిపల్లి వినోద్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీకి విధేయతతో పని చేస్తానని పేర్కొన్నారు.
నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు
తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేంద్ర కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గుంటి సుందరన్న, భానోత్ కిషన్ నాయక్, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మితో పాటు ఇతర నాయకులకు పగిడిపల్లి వినోద్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర పట్టణ నాయకులు కొల్లా రఘురాం, కొల్లా మల్లికార్జున్ రావు, కొల్లా రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి