బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి పీఏ మిరియాల శ్రీనివాస్
బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి పీఏ మిరియాల శ్రీనివాస్
పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస్
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పీఏ మిరియాల శ్రీనివాస్ దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందన్న శ్రీనివాస్
ఈ సందర్భంగా మిరియాల శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్, చిలుక రాములు, నవలగారి సైమన్, పట్లోళ్ల మల్లారెడ్డి, దావీద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి