ఎండల ఎఫెక్ట్‌పై అప్రమత్తం… గ్రామంలో 13 ట్రాన్స్ఫార్మర్లకు నీళ్లు పట్టించిన సర్పంచ్


ఎండల తీవ్రతతో అప్రమత్తం… ట్రాన్స్ఫార్మర్లకు నీళ్లు పట్టించిన సర్పంచ్ నాగేశ్వరరావు


విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు

తెలంగాణ స్రవంతి ప్రతినిధి: గ్రామంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని 13 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఎర్త్ పైపులకు నీళ్లు పట్టించే కార్యక్రమాన్ని నిర్వహించారు.


లో వోల్టేజ్ సమస్య నివారణకు చర్యలు

గ్రామ ప్రజలకు లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ట్రాన్స్ఫార్మర్లకు నీళ్లు పట్టించినట్లు గ్రామ సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు తెలిపారు.


ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరే లక్ష్యం

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం పడే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు, విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ పుట్ట కిరణ్ కుమార్, గోపి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం