ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి 113వ ర్యాంక్‌తో సత్తా చాటిన చిల్లంచెర్ల విద్యార్థి… నూక సిద్దుపై ప్రశంసల వెల్లువ


తెలంగాణ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి 113వ ర్యాంక్… చిల్లంచెర్ల యాదవ ముద్దుబిడ్డ నూక సిద్దు ఘనత


119 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన సిద్దు

తెలంగాణ స్రవంతి ప్రతినిధి అల్వాల ఉమేష్ చందర్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామానికి చెందిన నూక అశోక్ – సుమతి దంపతుల కుమారుడు నూక సిద్దు ఇటీవల విడుదలైన తెలంగాణ ఎంసెట్–2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. 119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.


గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యాదవ ముద్దుబిడ్డ

మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన నూక సిద్దు సాధించిన విజయం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా చిల్లంచెర్ల గ్రామానికి గర్వకారణంగా మారింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చని సిద్దు నిరూపించాడని పలువురు అభిప్రాయపడ్డారు.


ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు, నాయకులు

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మహ్మద్ సిరాజుద్దీన్, ఉపసర్పంచ్ దగ్గుల అనిల్, వార్డు సభ్యులు రేఖ మహేష్, గ్రామ పెద్దలు మహ్మద్ సత్తార్, సాధు సుధాకర్ రెడ్డి, శ్రీరామ్ వెంకన్న, దొంతు భద్రయ్య, మహ్మద్ ఫయాజ్, బట్టు సత్తయ్య, అలువాల అరుణ్, ఆశా వర్కర్ ఆసియా బేగం, నూక వెంకన్నతో పాటు స్ఫూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయ్య శాలువాతో సిద్దును ఘనంగా సన్మానించారు.


భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్ష

భవిష్యత్తులో సిద్దు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు గ్రామీణ విద్యార్థులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.


తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం