తిరుమలాయపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన – 100 మందికి పరీక్షలు, 80 మందికి ఆపరేషన్ అవసరం
🔴 ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
🟢 తిరుమలాయపాలెం మండలం – హస్నాబాద్ గ్రామం
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: తిరుమలాయపాలెం మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో సర్పంచ్ కొవ్వూరి పద్మ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు.
గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం వాసవి ఐ కేర్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న సుమారు 100 మంది ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.
🟢 80 మందికి శస్త్రచికిత్స అవసరం
పరీక్షల అనంతరం 80 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలిపారు. మరికొందరికి 50 శాతం డిస్కౌంట్‌తో చికిత్స అందిస్తామని వైద్య బృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాసవి ఐ కేర్ బృందం సభ్యులు, బీఆర్‌ఎస్ మండల నాయకులు కీసర సంకీర్తన రెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి, గ్రామ నాయకులు కొవ్వూరి సందీప్ రెడ్డి, మోటపోతుల శ్రీనివాస్, కాశిమల్ల మహేంద్ర, కొత్తపల్లి వెంకటరెడ్డి, పల్లి భాస్కర్, పల్లి వెంకన్న, మాగి మల్లయ్య, మాగి సతీష్, పల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 https://telanganasravanti.in

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి