కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి… ఎస్ఐ నవిత యాక్షన్

👉 9 మంది అదుపులో, నగదు స్వాధీనం

👉 కోడి పుంజులు, కత్తులు, 9 బైక్‌లు సీజ్

👉 పారిపోయిన వారి కోసం గాలింపు


మధిర, ఏప్రిల్ 09 తెలంగాణ స్రవంతి ప్రతినిధి:-


ఖమ్మం జిల్లా మధిర టౌన్ పరిధిలో అక్రమ కోడి పందేలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మడుపల్లి గ్రామ శివారు చెరువు వద్ద నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై మధిర టౌన్ ఎస్ఐ నవిత ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.


ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి రెండు కోడి పుంజులు, రెండు కోడి కత్తులు, 9 మోటార్ సైకిళ్లు, రూ.11,590 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.


అక్రమంగా కోడి పందేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా మధిర టౌన్ SHO మాట్లాడుతూ, పట్టణ పరిధిలో ఎవరైనా కోడి పందేలు, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి చర్యలపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


ఎస్ఐ నవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తరహా దాడులు మధిరలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం