ఖమ్మం జిల్లాలో TRP మున్సిపల్ మెనిఫెస్టో విడుదల

 


ఖమ్మం జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గౌరవ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, TRP క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సూచనలతో శుక్రవారం ఖమ్మం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కత్తెర గుర్తుపై పోటీ చేయదలచిన ఆశావహ అభ్యర్థులు 9059528984 నంబర్‌ను సంప్రదించాలని పార్టీ నాయకులు తెలిపారు. బీ-ఫారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల వద్ద బిక్షాటన చేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీ సిద్ధంగా ఉందని, పోటీకి ముందుకు రావాలని ఖమ్మం జిల్లా TRP వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీను, వైరా నియోజకవర్గ ఇంచార్జి తేల్లూరి ప్రకాష్, నీట్ట సుదర్శన్, జగదీశ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా

జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం