మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు హక్కులు ఏమిటి?
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి మౌలిక హక్కు. ఈ హక్కుతో పాటు ఓటరికి కొన్ని ముఖ్యమైన రక్షణలు, సౌకర్యాలు కూడా చట్టం కల్పించింది.
ఓటు వేసే హక్కు
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటర్ లిస్ట్‌లో ఉంటే తప్పనిసరిగా ఓటు వేయవచ్చు.
గుర్తింపు చూపించి ఓటు వేసే హక్కు
ఓటు వేయడానికి ఓటర్ ఐడీ కార్డు లేదా ఎన్నికల కమిషన్ అంగీకరించిన ఇతర గుర్తింపు కార్డు చూపించవచ్చు.
బెదిరింపులు లేకుండా ఓటు వేసే హక్కు
డబ్బులు చూపించి, బెదిరించి లేదా భయపెట్టి ఓటు వేయమంటే అది నేరం. ఇలాంటి ఘటనలపై మీరు ఫిర్యాదు చేయవచ్చు.
గోప్యంగా ఓటు వేసే హక్కు
మీరు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా మీ ఓటు వేయాలి. ఎవరూ మీరు ఎవరికి ఓటు వేశారో అడగలేరు.
సహాయం పొందే హక్కు
వృద్ధులు, దివ్యాంగులు వంటి వారు అవసరమైతే పోలింగ్ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. అనుమతితో తోడుగా ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లవచ్చు.
తప్పులు జరిగితే ఫిర్యాదు చేసే హక్కు
పోలింగ్ బూత్‌లో ఓటు వేయనివ్వకపోతే, ఎవరో గందరగోళం చేస్తే లేదా బోగస్ ఓటింగ్ జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి లేదా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
సమాన హక్కు
కులం, మతం, డబ్బు లేదా పార్టీ ప్రభావం వల్ల మీ ఓటు హక్కును లాక్కోవడం చట్ట విరుద్ధం.
ముఖ్యమైన సందేశం:
మీ ఓటు మీ ఆయుధం. భయపడకుండా, అమ్ముకోకుండా, స్వేచ్ఛగా ఓటు వేయండి.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి