పోస్ట్‌లు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు హక్కులు ఏమిటి?

చిత్రం
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి మౌలిక హక్కు. ఈ హక్కుతో పాటు ఓటరికి కొన్ని ముఖ్యమైన రక్షణలు, సౌకర్యాలు కూడా చట్టం కల్పించింది. ఓటు వేసే హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటర్ లిస్ట్‌లో ఉంటే తప్పనిసరిగా ఓటు వేయవచ్చు. గుర్తింపు చూపించి ఓటు వేసే హక్కు ఓటు వేయడానికి ఓటర్ ఐడీ కార్డు లేదా ఎన్నికల కమిషన్ అంగీకరించిన ఇతర గుర్తింపు కార్డు చూపించవచ్చు. బెదిరింపులు లేకుండా ఓటు వేసే హక్కు డబ్బులు చూపించి, బెదిరించి లేదా భయపెట్టి ఓటు వేయమంటే అది నేరం. ఇలాంటి ఘటనలపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. గోప్యంగా ఓటు వేసే హక్కు మీరు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా మీ ఓటు వేయాలి. ఎవరూ మీరు ఎవరికి ఓటు వేశారో అడగలేరు. సహాయం పొందే హక్కు వృద్ధులు, దివ్యాంగులు వంటి వారు అవసరమైతే పోలింగ్ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. అనుమతితో తోడుగా ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లవచ్చు. తప్పులు జరిగితే ఫిర్యాదు చేసే హక్కు పోలింగ్ బూత్‌లో ఓటు వేయనివ్వకపోతే, ఎవరో గందరగోళం చేస్తే లేదా బోగస్ ఓటింగ్ జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి లేదా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమాన హక్కు కులం, మతం, డబ్బు లేదా పార్టీ...

బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్

చిత్రం
  మధిర మున్సిపాలిటీ ఎన్నికల 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్ ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ అభ్యర్థిగా గ్యారంగుల కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మధిరలోని సంబంధిత ఎన్నికల కార్యాలయంలో ఆయన అధికారుల ఎదుట నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 22వ వార్డులో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గ్యారంగుల కుమార్ తెలిపారు. మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది.

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

చిత్రం
  హైకోర్టు బెయిల్ ఆదేశాల అమలులో భిన్నత్వమా? బోనకల్ SI తీరుపై ప్రశ్నలు ఖమ్మం జిల్లా, బోనకల్ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన బెయిల్ ఆదేశాలను ఖమ్మం జిల్లా బోనకల్ పోలీస్ స్టేషన్‌లో భిన్నంగా అమలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్దిష్ట సమయంలో పోలీస్ స్టేషన్‌కు హాజరై విచారణకు సహకరించాలనే షరతు మాత్రమే ఉండగా, ఆ షరతును మించి రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టడం ద్వారా అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల్లో “ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో హాజరు కావాలి” అని మాత్రమే స్పష్టంగా పేర్కొనగా, “ఆ సమయం మొత్తం స్టేషన్‌లోనే ఉండాలి” అనే ఆదేశం ఎక్కడా లేదని న్యాయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ, బోనకల్ పోలీస్ స్టేషన్‌లో కోర్టు ఆదేశాలను భిన్నంగా అర్థం చేసుకుని అమలు చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ విధానం బెయిల్ షరతుల అమలుగా కాకుండా, పరోక్ష కస్టడీలా మారిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి బెయిల్ పొందిన వ్యక్తులు తమ రోజువారీ జీవనానికి, ఉపాధికి వెళ్లే హక్కు ఉన్నప్పటికీ, గంటల తరబడి స్...

ఈత చెట్ల తొలగింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

చిత్రం
  ఖమ్మం జిల్లాలో గీత కార్మికుల జీవనాధారమైన 50 ఈత చెట్లు పీకివేత ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం | :- ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామంలో గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్ బుధవారం ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం దమ్మాయిగూడెం గ్రామ గౌడ సంఘం సభ్యులు తమ జీవనోపాధి కోసం గ్రామ చెరువు కట్టపై వందల సంఖ్యలో ఈత మొక్కలను నాటినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గ్రామ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాం రాజశేఖర్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి రమేష్ జెసిబి సహాయంతో సుమారు 50 ఈత చెట్లను కక్షపూరితంగా తొలగించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల ఉపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో, ఇలా నాటిన చెట్లను తొలగించడం గీత కార్మికులను ఉపాధి లేకుండా చేయడమే కాకుండా వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఈత చెట్లను తొలగించిన వారిపై ...

ఖమ్మం జిల్లాలో TRP మున్సిపల్ మెనిఫెస్టో విడుదల

చిత్రం
  ఖమ్మం జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గౌరవ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, TRP క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సూచనలతో శుక్రవారం ఖమ్మం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కత్తెర గుర్తుపై పోటీ చేయదలచిన ఆశావహ అభ్యర్థులు 9059528984 నంబర్‌ను సంప్రదించాలని పార్టీ నాయకులు తెలిపారు. బీ-ఫారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల వద్ద బిక్షాటన చేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీ సిద్ధంగా ఉందని, పోటీకి ముందుకు రావాలని ఖమ్మం జిల్లా TRP వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీను, వైరా నియోజకవర్గ ఇంచార్జి తేల్లూరి ప్రకాష్, నీట్ట సుదర్శన్, జగదీశ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. — తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా జనంనుంచి జనంలోకి

విద్యార్థుల అల్పాహారానికి రూ.10,000 విరాళం

చిత్రం
  ఎర్రుపాలెం మండలం మీనవోలు ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ యూత్ నాయకుల సేవా కార్యక్రమం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల అల్పాహార అవసరాల కోసం గ్రామ టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రూ.10,000 నగదు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుడుముల మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే ఈ సహాయం అందించామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అఖిల్, కుడుముల వెంకట్ రెడ్డి, నాగుల్ మీరా, సోమశేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, గ్రామ పెద్దలు కొండూరు నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ముందుకు వచ్చిన టీఆర్ఎస్ యూత్...

“గ్రౌండ్ మధ్యలో బిల్డింగ్? సిరిపురంలో వివాదం”

చిత్రం
సిరిపురం గ్రామంలో ఉద్రిక్తత ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో కళాశాల భవన నిర్మాణం అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని గ్రౌండ్‌ మధ్యలో భవనం నిర్మించడంతో స్థానిక విద్యార్థులు, యువకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ మధ్యలో బిల్డింగ్ నిర్మిస్తే గ్రామంలో ఉన్న ఏకైక ఆటస్థలం పూర్తిగా నిరుపయోగంగా మారిపోతుందని విద్యార్థులు, యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తున్నారు. ఆటస్థలం లేకపోవడం వల్ల భవిష్యత్తులో క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, అదే స్థలంలోనే భవనం నిర్మించాలని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు, యువకులు నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులుప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారని, చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు హెచ్చరించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. బిల్డింగ్ నిర్మాణ ప్రదర్శన మార్చినంత మాత్రాన కాంట్రాక్టర్‌కు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జ...