బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్
మధిర మున్సిపాలిటీ ఎన్నికల 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థి గ్యారంగుల కుమార్ నామినేషన్
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డు నుంచి బి ఆర్ ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ అభ్యర్థిగా గ్యారంగుల కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
మధిరలోని సంబంధిత ఎన్నికల కార్యాలయంలో ఆయన అధికారుల ఎదుట నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 22వ వార్డులో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గ్యారంగుల కుమార్ తెలిపారు.
మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి