విద్యార్థుల అల్పాహారానికి రూ.10,000 విరాళం

 


ఎర్రుపాలెం మండలం మీనవోలు ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ యూత్ నాయకుల సేవా కార్యక్రమం

ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల అల్పాహార అవసరాల కోసం గ్రామ టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రూ.10,000 నగదు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుడుముల మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే ఈ సహాయం అందించామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అఖిల్, కుడుముల వెంకట్ రెడ్డి, నాగుల్ మీరా, సోమశేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, గ్రామ పెద్దలు కొండూరు నాగేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ముందుకు వచ్చిన టీఆర్ఎస్ యూత్ నాయకుల సేవా భావాన్ని గ్రామస్తులు అభినందించారు.

తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం