పర్మిట్ ఉందట… కానీ వివరాలు ఎక్కడ?”
పర్మిట్ వివరాలపై స్పష్టత లేక సందేహాలు: పారదర్శకతపై ప్రశ్నలు మధిర,ఎర్రుపాలెం, పలు గ్రామలా పరిధిలో చెట్ల నరికివేత, కర్ర రవాణా అంశంపై స్థానికులలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత శాఖల నుండి “పర్మిట్ ఉంది” అనే సమాధానం వస్తున్నప్పటికీ, ఆ పర్మిట్ ఎన్ని చెట్లకు జారీ అయింది? ఏ సర్వే నంబర్‌కు సంబంధించినది? ఎప్పుడు జారీ అయింది? వంటి వివరాలపై స్పష్టత లభించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక చెట్టుకు మాత్రమే పర్మిట్ ఉన్నదా? లేక మరిన్ని చెట్లకా? అన్న విషయంలో అధికారికంగా ధృవీకరించిన వివరాలు బయటకు రావడం లేదు. కేవలం “పర్మిట్ ఉంది” అనే సాధారణ సమాధానం ఇవ్వడం వల్ల ప్రజల్లో సందేహాలు కొనసాగుతున్నాయి. చట్టపరమైన పారదర్శకత అవసరం భారతదేశంలో అమల్లో ఉన్న Right to Information Act, 2005 ప్రకారం, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న అనుమతులు, పర్మిట్ వివరాలు వంటి సమాచారం పౌరులు కోరితే అందించాల్సిన బాధ్యత ఉంది. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి సమాధానం పొందేలోపు, కర్ర లోడ్ రవాణా పూర్తవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సమాచారం వచ్చినా, వాస్తవ పరి...