మధిర రైల్వే స్టేషన్ జోన్ మార్పు అంశంపై ఉద్యోగుల ఐక్యత – GM ను కలవాలని నిర్ణయం
మధిర:
మధిర రైల్వే స్టేషన్‌ను South Central Railway పరిధి నుంచి South Coast Railway జోన్‌లోకి మార్చే ప్రక్రియపై స్థానికంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో మధిర రైల్వే ఉద్యోగులు సమావేశమయ్యారు.
స్టేషన్ భవిష్యత్, రైళ్ల ఆపుదల, ప్రయాణికుల సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. జోన్ మార్పు వల్ల మధిర రైల్వే స్టేషన్‌కు ఎలాంటి పరిపాలనా, ఆపరేషనల్ మార్పులు వస్తాయో స్పష్టత కోరాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో సంబంధిత అధికారిని (ADEN) కలిసి తమ ఆందోళనలను వివరించారు. ఉన్నతాధికారులను సంప్రదించాలని, ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ మేనేజర్ (GM/SC) ను కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించినట్లు సమాచారం.
మధిర రైల్వే స్టేషన్ రోజువారీగా వేలాది ప్రయాణికులకు సేవలందిస్తున్న కీలక కేంద్రం కావడంతో, స్థానిక ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని ఉద్యోగులు పేర్కొన్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలతో కలిసి అధికారిక స్థాయిలో వినతులు సమర్పించాలనే దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
“మన మధిర రైల్వే స్టేషన్‌ను మనమే కాపాడుకోవాలి” అనే నినాదంతో ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి