అంజనపూరి జంక్షన్‌లో ట్రాఫిక్ అలర్ట్… ప్రమాదాల నివారణకు రంగంలోకి దిగిన పోలీసులు

మామిడికాయ మార్కెట్ల వద్ద ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల చర్యలు


అంజనపూరి జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిన పోలీసులు

తెలంగాణ స్రవంతి ప్రతినిధి: సూర్యాపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 65పై అంజనపూరి జంక్షన్ వద్ద మామిడికాయ మార్కెట్లు ఏర్పాటు కావడంతో రోడ్డు ప్రమాదాల నివారణకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


రోడ్డుపై వాహనాలు నిలపకుండా డ్రమ్ముల ఏర్పాటు

మామిడికాయల కొనుగోలు, అమ్మకాల కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డు పక్కన నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు రహదారిపై డ్రమ్ములు ఏర్పాటు చేసి వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకున్నారు.


వ్యాపారులు, రైతులకు ట్రాఫిక్ ఎస్ఐ సూచనలు

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నిలపవద్దని సూచించారు. మామిడికాయల అమ్మకానికి వచ్చే రైతులు, వ్యాపారులు రోడ్డు కింద భాగంలోకి వెళ్లి వ్యాపారం నిర్వహించాలని కోరారు.


ప్రజల భద్రతే లక్ష్యమని వ్యాఖ్య

ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
🔗 telanganasravanti.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం