మహిళలు, యువత రాజకీయాల్లోకి రావాలి… 2029లో పోటీ చేస్తాం: కల్వకుంట్ల కవిత
మహిళలు, యువత రాజకీయాల్లోకి రావాలి… 2029లో పోటీ చేస్తాం: కల్వకుంట్ల కవిత
తెలంగాణ ప్రజల రక్షణే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేవ పని చేస్తుందన్న కవిత
తెలంగాణ స్రవంతి ప్రతినిధి: యువత మరియు మహిళలు రాజకీయాల్లోకి ముందుకు రావాలని, తెలంగాణ ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేవ పనిచేస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
గజ్వేల్‌లో దేవాలయాల సందర్శన
బుధవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అనంతరం పెద్దమ్మ తల్లి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రశ్నించే తత్వం పెంపొందించుకోవాలి
యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి చైతన్యంతో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు.
2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన
2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన కవిత, ప్రజలకు వైద్యం మరియు విద్య ఉచితంగా అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. మహిళా సాధికారత, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, సామాజిక తెలంగాణ నిర్మాణం తమ ప్రధాన లక్ష్యాలని చెప్పారు.
జాగృతి వేదికగా యువతకు శిక్షణ
యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చిన కవిత, ఇందుకోసం తెలంగాణ జాగృతి వేదికగా రాజకీయ, సామాజిక అవగాహనపై శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ స్రవంతి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి