అంకితభావానికి అభినందన… ఉత్తమ ఉపాధ్యాయుడు షేక్ ఇబ్రహీం ఘన సన్మానం
👉 సేవలకు గౌరవంగా వీడ్కోలు
👉 ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు నిదర్శనం
👉 కాలనీ వాసుల నుంచి విశేష ప్రశంసలు
మధిర, ఏప్రిల్ 09
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావం, నిబద్ధతతో సేవలందించిన షేక్ ఇబ్రహీంను స్థానిక సుందరయ్య నగర్ టీచర్స్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల మాటూరు ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసిన ఆయనను స్వగృహంలో దుశ్యాలువ, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, “ఉపాధ్యాయుడు పుస్తకాలకే పరిమితం కాదు… విద్యార్థుల జీవితాలను మలిచే శిల్పి” అని కొనియాడారు. షేక్ ఇబ్రహీం తన సేవల కాలమంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించారని ప్రశంసించారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టాలను జయిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆయన జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించడంలో ఆయన పాత్ర మరపురానిదని తెలిపారు.
“ఒక మంచి గురువు జీవితాంతం ప్రభావం చూపుతాడు… తరగతి గదిలో మొదలైన బోధన, సమాజంలో మార్పుకు దారితీస్తుంది” అనే సందేశాన్ని ఆయన తన జీవితంతో చాటిచెప్పారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ అధ్యక్షుడు దేవరకొండ లక్ష్మిబాబు, ఉపాధ్యక్షుడు ఎర్రమల వెంకటేశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారులు తలుపుల సాంబయ్య, చీకటి నాగేశ్వరావు, కమిటీ సభ్యులు బండారు నాగరాజు, దుద్దుకూరు లింగయ్య, మహమ్మద్ రఫీ, బైర్ల చెన్నయ్య, కూరపాటి రమేష్, కాలనీ పెద్దలు పోతురాజు కృష్ణయ్య, షేక్ నాగుల్ మీరా (రిటైర్డ్ AE), తోట నరసింహారావు, తలపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏ. వినోద్ రావు, కంచిపోగు ఆదామ్, శీలం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
“గురువు వెలిగితేనే సమాజం వెలుగుతుంది” అనే భావంతో ఈ సన్మాన కార్యక్రమం సార్థకమైంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి