మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
👉 రైతులకు నేరుగా విక్రయానికి అవకాశం
👉 మద్దతు ధరలతో పారదర్శక కొనుగోలు ప్రక్రియ
👉 కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా ఘన ప్రారంభం
మద్నూర్, ఏప్రిల్ 10
తెలంగాణ స్రవంతి ప్రతినిధి సచిన్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా నిర్వహించే ప్యాడి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దారాస్ సాయిలు, స్థానిక సర్పంచ్ రాజేశ్వర్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహణ జరగడం వల్ల పారదర్శకత పెరిగి రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు ₹2389, సాధారణ గ్రేడ్ ధాన్యం ₹2369గా మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందాలని సూచించారు.
“రైతు శ్రమకు సరైన విలువ దక్కాలి… మహిళా సంఘాల పాత్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోపి, సలీం మహ్మద్ అబ్బు, దావుద్, చందు, సంతోష్, విజయ్, గోరిబి, ఏఈఓ సంయుక్త, సీసీ రాములు, జీపీవో సత్యం, సెక్రటరీ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి