సంఘటన్ సృజన్ అభియాన్’లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు
👉 డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో ఏఐసీసీ పరిశీలకుడిగా బాధ్యతలు
👉 సాంగ్లీ జిల్లాలో ఘన స్వాగతం
👉 పారదర్శకంగా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని స్పష్టం
జుక్కల్, ఏప్రిల్ 15
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనను ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించారు.
సాంగ్లీ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
స్థానిక నాయకుల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి పంపించి, తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కార్యకర్తలు సహకరించాలని పిలుపునిచ్చారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి