సమసమాజ సందేశంతో ఘనంగా బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు
👉 పెద్ద ఎక్లరా గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య ఉత్సవాలు
👉 సమానత్వం, సోదరభావం బోధించిన మహానుభావుడికి ఘన నివాళి
👉 బసవేశ్వరుని బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకం
మద్నూర్, ఏప్రిల్ 19
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో మహాత్మా బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, లింగాయత్ సమాజ సభ్యులు పాల్గొని మహానుభావుడికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ గురువులు సోమనాథ్ అప్ప, అశోక్ అప్ప ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ద్వజారోహణం చేశారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన మహనీయుడని, ఆయన బోధనలు సమానత్వం, సోదరభావం, మానవత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, కుల వివక్షను నిర్మూలించేందుకు బసవేశ్వరుడు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికీ అత్యంత ప్రాసంగికమని, యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
👉 ప్రజల స్పందన:
గ్రామస్థులు బసవేశ్వరుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని, ఆయన బోధనలు తమ జీవితాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
👉 సామాజిక సందేశం:
సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలు బసవేశ్వరుని ఆలోచనల సారం అని, సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని అనుసరించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల లింగాయత్ సమాజ్ అధ్యక్షులు పండిత్ రావు పటేల్, గ్రామ సర్పంచ్ సోమవార్ మహేష్, మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, హనుమంతరావు దేశాయ్, మాజీ ఎండోమెంట్ చైర్మన్ ఎస్ హనుమంత్ ముంగడే, బసవంతరావు, ఆడికే శేషారావు పటేల్, మెర్గేవర్ పండరి తదితరులు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి