“సాగునీటి కోసం అల్లినగరం రైతుల ధర్నా… బోనకల్లు రోడ్డుపై భారీ నిరసన”

సాగునీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అల్లినగరం రైతులు బోనకల్లు రోడ్డుపై భారీగా ధర్నా నిర్వహించారు. మోటామర్రి, అల్లినగరం, మడుపల్లి, దేశనేనిపాలెం గ్రామాల భూములకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో ఎల్బీనగర్ రైతులు శాఖమూరి కోటేశ్వరరావు, సూర్యదేవర సాంబశివరావు, పాటిబండ్ల శ్రీహరి, కమతం నరసింహారావు తదితరులు పాల్గొని రైతులతో కలిసి ఈ ప్రాంత భూములకు సాగర్ నీరు అందించాలని గట్టిగా నినదించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నా కారణంగా బోనకల్లు రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, అధికార యంత్రాంగం స్పందించి ఈ గ్రామాల భూములకు సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం