నిజాయితీని గెలిపించండి: ఓటర్లకు మల్లు మధులత సందేశం
డబ్బు రాజకీయాలకు కాదు… ప్రజల పాలనకే ఓటు: నిజాయితీకి మద్దతుగా పిలుపు
డబ్బు రాజకీయాల ప్రభావాన్ని తగ్గించి, ప్రజల పాలనకు బలం చేకూర్చాలని పిలుపునిస్తూ “డబ్బు రాజకీయాలకు కాదు… ప్రజల పాలనకు ఓటు” అనే నినాదంతో అవగాహన ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా “నిజాయితీని గెలిపించండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఓటు విలువను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న సందేశాన్ని ఈ ప్రచారం బలంగా వినిపిస్తోంది. నాయకుల పనితనం, నిజాయితీ, ప్రజాసేవనే ప్రామాణికంగా చూసి నిర్ణయం తీసుకోవాలని పలువురు పిలుపునిస్తున్నారు.
ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ 5వ వార్డు సభ్యురాలు మల్లు మధులత మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటే అసలైన శక్తి అని, ఆ శక్తిని అమ్ముకోకుండా దేశం–రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వినియోగించాలని అన్నారు. డబ్బు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీకి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ఈ నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీస్తోంది.
తెలంగాణ స్రవంతి మీడియా — జనంనుచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి