టీడీపీని తాకట్టు పెట్టారా? డాక్టర్ రామనాధం పై కార్యకర్తల ఘాటు ఆరోపణలు


 డాక్టర్ రామనాధం తిరుపై టీడీపీ కార్యకర్తల తీవ్ర ఆవేదన… “పార్టీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర తాకట్టు పెట్టి ఏమి లాభం పొందుతున్నారు?” అంటూ ప్రశ్నలు

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రామనాధం తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గంలో టీడీపీ పార్టీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర “తాకట్టు పెట్టినట్లుగా” వ్యవహరిస్తున్నారని, దాని ద్వారా ఎలాంటి లాభం పొందాలని చూస్తున్నారో చెప్పాలని కార్యకర్తలు ప్రశ్నించారు.

పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలను పక్కన పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన పెరుగుతోందని వారు తెలిపారు. గ్రాస్‌రూట్ స్థాయిలో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు సరైన గౌరవం, గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీని బలోపేతం చేయాల్సిన సమయంలో, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహారాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. “పార్టీని వేరే రాజకీయ శక్తుల ముందు బలహీనంగా చూపించడం వల్ల చివరికి నష్టం జరిగేది కార్యకర్తలకే” అని వారు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని, కార్యకర్తల భావోద్వేగాలను గౌరవించి సరైన దిశానిర్దేశం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుచి జనంలోకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

కోర్టు ఆదేశాలకే అర్థం మారిందా? బోనకల్ పోలీస్ స్టేషన్ విధానంపై విమర్శలు

మధిర మండలంలో ఆపినా ఆగని బస్సు – వృద్ధులు పరుగులు, ప్రజల్లో ఆగ్రహం