BREAKING NEWS | మధిర బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా కపిలవాయి రవీందర్ నియామకం
కపిలవాయి రవీందర్‌కు ఎన్నికల నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. 2009లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ఆయన, గతంలో హైదరాబాద్ GHMC చంద్రాయణ్‌గుట్ట ఎన్నికల ఇంచార్జ్‌గా, వరంగల్ కార్పొరేషన్ ఇంచార్జ్‌గా, మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా పనిచేశారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎన్నికల ఇంచార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
అదేవిధంగా బీజేపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా, పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడిగా, ఎన్నికల లిటరేచర్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. కపిలవాయి రవీందర్ కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా కూడా సేవలందించడంతో పాటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు.
మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని, మధిరలో బీజేపీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి… జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి