మధిరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం: రాజకీయ విమర్శలు
మధిరలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన కష్టం, వామపక్ష పార్టీల సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా రూపుదిద్దుకున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్య హక్కు కోసం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను, మున్సిపాలిటీ ఎన్నికల ముందు మధిరలో హడావుడిగా ప్రారంభోత్సవం చేసి ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని ప్రచారం చేస్తున్నా, వాస్తవంగా అక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? అవసరమైన డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది నియామకం జరిగిందా? వైద్య పరికరాలు, మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా? అన్న మధిర ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. కేవలం రిబ్బన్ కట్ చేసి, ఫోటోలు దిగడం ద్వారా ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకమే ఇది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మధిరలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ దక్కించుకోవడం, వామపక్షాల పోరాటాలను పూర్తిగా విస్మరించడం అనైతికమని విమర్శకులు చెప్పారు. ఎన్నికలు దగ్గరపడగానే అభివృద్ధి పేరుతో ప్రారంభోత్సవాల హడావుడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా మధిర ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ లాభాలకన్నా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. మాయాజాలంగా మాత్రమే మిగిలిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలు అంటేనే అలా ఉంటాయి.
రిప్లయితొలగించండిరాజకీయాలు అంటేనే ప్రజలను మోసం చేయటం
రిప్లయితొలగించండి