బూర్దిపాడ్ రేషన్ పంపిణీలో గందరగోళం.. లబ్ధిదారులకు అందని బియ్యం!
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి www.telanganasravanti.in ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనం సంగారెడ్డి జిల్లా | జహీరాబాద్ నియోజకవర్గం | జహీరాబాద్ మండలం బూర్దిపాడ్‌లో రేషన్ బియ్యం కోసం గ్రామస్థుల ఎదురుచూపులు! అందుబాటులో లేని రేషన్ డీలర్.. కొందరికి 4 కిలోల బియ్యమే పంపిణీ చేశారంటూ గ్రామస్థుల ఆవేదన.. మూడు రోజులుగా తెరుచుకోని రేషన్ షాపు! జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, జహీరాబాద్ మండలం బూర్దిపాడ్ గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రేషన్ బియ్యం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఈసారి కూడా పలువురు లబ్ధిదారులకు బియ్యం అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం పంపిణీపై డీలర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదని ఆరోపిస్తున్నారు. షాపులో ఉన్న బియ్యాన్ని అందరికీ సరిపెట్టేందుకు డీలర్ భార్య కొంతమంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి కేవలం 4 కిలోల చొప్...