బోధన్ 99 ఏళ్ల లీజు ఆస్తులపై ఫిర్యాదు.. రికార్డుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి బోధన్ మున్సిపల్ 99 ఏళ్ల లీజు ఆస్తులపై ఫిర్యాదు బోధన్, నిజామాబాద్ జిల్లా • సెప్టెంబర్ 28 • తెలంగాణ స్రవంతి బోధన్ మున్సిపల్ 99 ఏళ్ల లీజు ఆస్తులపై ఫిర్యాదు రికార్డుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు విజ్ఞప్తి.. లీజు భూములపై సమగ్ర విచారణ, డిజిటలైజేషన్‌కు డిమాండ్ బోధన్, సెప్టెంబర్ 28 (తెలంగాణ స్రవంతి): బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 99 సంవత్సరాల లీజు కింద ఉన్న విలువైన మున్సిపల్ భూములు, భవనాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు ఫిర్యాదు అందింది. లీజు ఆస్తులకు సంబంధించిన పాత రికార్డులను భద్రపరచడంతో పాటు వాటి వివరాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్‌లో రికార్డుల తారుమారుకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారులు కోరారు. లీజు ఆస్తుల రికార్డులపై ఆందోళన ...