చండ్రుగొండ విద్యుత్ సమస్యలపై ఉన్నతస్థాయి దృష్టి.. సీఎండీకి దిశా కమిటీ సభ్యుడి వినతి
విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్‌ను కలిసిన దిశా కమిటీ సభ్యుడు బొర్రా సురేష్ చండ్రుగొండ | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | తెలంగాణ స్రవంతి ప్రతినిధి | బొగ్గుల శివ నాగిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా దిశా కమిటీ సభ్యుడు బొర్రా సురేష్ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి. పాటిల్ ఐఏఎస్ ను హైదరాబాద్‌లోని విద్యుత్ పంపిణీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంతో పాటు జిల్లాలోని పలు విద్యుత్ సమస్యలను ఆయన సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గిరి వికాస్ బోర్లకు సోలార్ విద్యుత్ చండ్రుగొండ మండలంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గిరి వికాస్ బోర్లకు సోలార్ విద్యుత్ సదుపాయం కల్ప...