ఆదివాసి సంస్కృతి మన అస్తిత్వం… గిరిజన జీవన విధానం తరతరాలకు మార్గదర్శకం
👉 గిరిజన సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క పిలుపు 👉 ఇలవేల్పుల చరిత్ర గ్రంథం ఆవిష్కరణ 👉 గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబాటు చండ్రుగొండ, ఏప్రిల్ 10 తెలంగాణ స్రవంతి ప్రతినిధి బొగ్గుల శివ నాగిరెడ్డి ఆదివాసి గిరిజన తెగల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు మన అస్తిత్వానికి ప్రతీకలని, వాటిని రాబోయే తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో నిర్వహించిన ఆదివాసి సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయ ఇలవేల్పుల చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం ఆమెకు ఘన స్వాగతం పలికారు. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు, గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. మంత్రి మాట్లాడుతూ ఆదివాసులే దేశానికి మూలవాసులని, వారి సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు సమాజానికి ఆదర్శమని అన్నారు. గిరిజన తెగల ఐకమత్యానికి రేల పాటలు, డోలు నాదం ప్రతీకలని పేర్కొన్నారు. పూర్వీకు...