మాట ఇచ్చా... నెరవేర్చుకుంటూ పోతా.. అభివృద్ధి, సంక్షేమమే నా ఎజెండా: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
📢 మాట ఇచ్చా... నెరవేర్చుకుంటూ పోతా.. అభివృద్ధి, సంక్షేమమే నా ఎజెండా: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 📍 చండ్రుగొండ / దమ్మపేట | తెలంగాణ స్రవంతి ప్రతినిధి బొగ్గుల శివనాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని, అభివృద్ధి మరియు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 🚧 రూ.57 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మందలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి, ప్రయాణికులు మరియు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 🚌 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ప్రభుత్వ కట్టుబాటు గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప...