వేసవి దాహాన్ని తీర్చే చలివేంద్రం… హస్నాబాద్‌లో ప్రారంభం
👉 ఎస్ఐ కూచిపూడి జగదీష్ చేతుల మీదుగా ప్రారంభం
👉 ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
👉 గ్రామస్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమం
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 15
తెలంగాణ స్రవంతి ప్రతినిధి
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు హస్నాబాద్ గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని బొడ్రాయి సెంటర్ వద్ద గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జగదీష్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవసరం లేకుండా బయటకు రావొద్దని తెలిపారు.
అలాగే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో పనులు పూర్తి చేసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో టోపీ, తలపాగా ధరించడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, కార్మికులు, స్థానిక ప్రజలకు ఉపశమనం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొవ్వూరి సత్తిరెడ్డి, కీసర సంకీర్తన రెడ్డి, కొవ్వూరి సందీప్ రెడ్డి, గ్రామ కార్యదర్శి పల్లి వినోద్, మేటబోతుల శ్రీనివాస్, మోటపోతుల చిన్న శ్రీనివాస్, మాగి వెంకన్న, కొత్తపల్లి వెంకటరెడ్డి, నర్సింహారెడ్డి, కొవ్వూరి వెంకరెడ్డి, తండా అంజయ్య, పసాలది రవి, మాగి లక్ష్మణ్, పల్లి భాస్కర్, పల్లి అశోక్, పల్లి నవీన్, సన్నాయల యాదగిరి, భిక్షం రెడ్డి, మాగి నరేష్, గుండా వీరన్న, సంకా భాస్కర్, పల్లి వెంకన్న, పురం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
👉 మరిన్ని వివరాల కోసం:
🔗 https://telanganasravanti.in
తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా – జనంనుంచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి