శివరాత్రి తిరునాళ్లలో భక్తుల మనోభావాలకు దెబ్బ: గుడి పక్కనే నాన్‌వెజ్ విక్రయాలు
ఖమ్మం జిల్లా మధిరలో జరుగుతున్న శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా గుడి పరిసర ప్రాంతాల్లో నాన్‌వెజ్ ఆహార పదార్థాల విక్రయాలు భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆలయానికి చాలా సమీపంలోనే నాన్‌వెజ్ దుకాణాలు ఏర్పాటు చేయడంతో, పూజలు, దర్శనాలకు వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ఇలాంటి పవిత్రమైన సందర్భంలో గుడి పక్కనే నాన్‌వెజ్ విక్రయాలు కొనసాగడం సంప్రదాయాలకు, భక్తుల భావాలకు విరుద్ధంగా ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.
గత సంవత్సరం కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సంవత్సరం తిరునాళ్లలో అలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. నాన్‌వెజ్ దుకాణాలను ఆలయానికి దూరంగా ఏర్పాటు చేసి, పండుగ వాతావరణాన్ని పవిత్రంగా, ప్రశాంతంగా కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ విషయంపై మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు వెంటనే దృష్టి సారించి తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భక్తుల సౌకర్యం, శాంతియుత వాతావరణం దృష్ట్యా అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ స్రవంతి మీడియా — జనంనుచి జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి