మధిర మున్సిపల్ బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా భిక్కి అనిత ఖరారు
మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి చైర్మన్ అభ్యర్థిగా భిక్కి అనిత పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధిర టౌన్ పరిధిలోని 4వ వార్డు చేరుకుమల్లి వారి వీధి, ఇల్లెందుల పాడు ప్రాంతం నుంచి భిక్కి అనిత ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన భిక్కి అనిత భర్త భిక్కి కృష్ణ ప్రసాద్ గతంలో రెండు సార్లు మధిర సహకార సంఘం చైర్మన్‌గా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అలాగే భిక్కి అనిత గతంలో మధిర మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇదే సమయంలో మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్–సీపీఎం మధ్య పొత్తు ఖరారైనట్లు తెలిసింది. ఈ పొత్తులో భాగంగా సీపీఎంకు మూడు వార్డులు కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మధిర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
— తెలంగాణ స్రవంతి డిజిటల్ మీడియా
జనం నుంచి… జనంలోకి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి