ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి
వినియోగదారుల ఆగ్రహానికి గురైన మధిర గ్యాస్ ఏజెన్సీ 🟨 సిలిండర్ల సరఫరాలో ఆలస్యం – అదనపు వసూళ్లపై ఆరోపణలు 🟦 చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేసే హెచ్చరిక 📍 మధిర, తెలంగాణ స్రవంతి ప్రతినిధి మధిర ప్రాంతంలో గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికంగా పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ సేవల విషయంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందడం లేదని పేర్కొన్నారు. రోజువారీగా వందలాది మంది వినియోగదారులు గ్యాస్ గోడౌన్ వద్ద క్యూ కట్టి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమన్నారు. మండుతున్న ఎండలో గంటల తరబడి నిలబడి గ్యాస్ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే, బుక్ చేసిన...